శ్రీలంక సర్కార్ అత్యవసర భద్రతా సమావేశం.. ఆత్మాహుతి దాడిగా అనుమానం


కొలంబో: ఈసర్ట్ ప్రార్థనల సందర్భంగా ఆదివారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లలో చోటుచేసుకున్న గొలుసుకట్టు పేలుళ్ల ఘటనలో 100 మందికి పైగా మృతి చెందడం, సుమారు 300 మంది గాయపడటంతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానమంత్రి రనిల్ విక్రమ్‌సింఘే అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి బాంబర్ దాడులుగా ఈ ఘటనలను ప్రభుత్వం అనుమానిస్తోంది. 
 
కాగా, పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో 200 ట్రూప్‌లను ఆర్మీ మోహరించింది. వివిధ దేశాల రాయబార కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొలంబోలోని మూడు ఖరీదైన హోళ్లు, ఓ చర్చితో పాటు కొలంబో సమీపంలో ఒకటి, తూర్పు ప్రాంతంలో మరొక చర్చి లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. పేలుళ్లకు కారణం ఏమిటనేది కానీ, ఉగ్రదాడి కావచ్చనే దానిపై కానీ ఇంకా అధికారులు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. ఇది తమ పనేనంటూ ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. మరోవైపు, పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని  శ్రీలంక ప్రభుత్వం రేపు, ఎల్లుండ పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *