షాట్‌ గన్‌.. మిస్‌ఫైర్‌


  • జిన్నా కాంగ్రెస్‌ కుటుంబ సభ్యుడే: శతృఘ్న
  • రాజకీయ దుమారం.. నోరు జారానని వివరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: ‘‘మహాత్మాగాంధీ నుంచి మహ్మద్‌ అలీ జిన్నా వరకూ అంద రూ కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులే’’ అంటూ బీజేపీ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడిని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగడంతో నోరు జారానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను నోరుజారానని అంగీకరించిన ఆయన.. మౌలానా ఆజాద్‌ పేరుకు బదులు జిన్నా అన్నానని తెలిపారు. సిన్హా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మాట్లాడుతూ.. వీటిపై ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ‘కొద్ది రోజుల క్రితం వరకూ ఆయన బీజేపీతోనే ఉన్నారు. మరి ఇన్నేళ్లుగా ఆయన బీజేపీలో ఎలా కొనసాగారో ఆ పార్టీనే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *