షారుఖ్‌.. మీ ప్రయత్నం అద్భుతం


  • బాలీవుడ్‌ బాద్‌షాకు ప్రధాని ప్రశంస
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ విడుదల చేసిన ర్యాప్‌ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంసల వర్షం కురిపించారు. షారుఖ్‌ అద్భుతమైన ప్రయత్నం చేశారని ట్విటర్‌లో కొనియాడారు. ‘ఓటేసే సమయం ఇదే’ అంటూ షారుఖ్‌ ఇటీవల ఓ వీడియో చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘షారుఖ్‌.. మీ ప్రయత్నం అద్భుతం. మీ పిలుపుతో భారత ప్రజలు భారీగా ఓటింగ్‌లో పాల్గొంటారు. మొదటిసారి ఓటు వేయబోయే యువతరం మీ పిలుపునకు కచ్చితంగా స్పందిస్తుంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *