సన్యాసి కావాలనుకున్నా: మోదీ


న్యూ ఢిల్లీ: తాను ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మోదీని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకున్నానని మోదీ తెలిపారు. రాజకీయాల కన్నా ఇతర విషయాలపై మాట్లాడటం తనకు మరింత ఆనందాన్నిస్తుందన్నారు. అలాగే తనకు బయోగ్రఫీలు చదవడమంటే చాలా ఇష్టమని మోదీ తెలిపారు.
 
రామకృష్ణ మిషన్‌ నాకు స్ఫూర్తి అని తెలిపారు. సన్యాసి కావాలనుకున్నానని పేర్కొన్నారు. తాను తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటానని మోదీ తెలిపారు. తాను కఠినంగా ఉంటానని.. కానీ ఎవ్వరినీ అవమానించనని పేర్కొన్నారు. ఒత్తిడిలో పనిచేయడం అలవాటు చేసుకున్నానన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నానని మోదీ తెలిపారు. తాను స్వయంగా పనిచేస్తూ… అందరితో పని చేయిస్తుంటానని పేర్కొన్నారు. తాను పనిచేయడం చూసి తన చుట్టూ ఉన్న అధికారులు కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల్లో కూడా తనకు చాలా మంది మిత్రులున్నారని మోదీ వెల్లడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *