సమన్వయం… జీరో


  • రైతుల ప్రమేయం లేకుండా ప్రకృతి సేద్యం
  • మెరుగుపడని మార్కెటింగ్‌ వసతులు
  • లోపాలను బహిర్గతం చేసిన విజిలెన్స్‌
  • అధికారుల మధ్య కొరవడిన సమన్వయం
  • నేడు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం
రైతులకు లాభదాయకం.. ప్రకృతికి మేలు.. ఆయా ఉత్పత్తులతో ఆరోగ్యం.. ఇదే లక్ష్యంగా జీరో బడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ – జడ్‌బీఎన్‌ఎఫ్‌ ప్రకృతి సేద్యం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. అయితే జిల్లాలో ఈ వ్యవసాయానికి సంబంధించి రైతుల ప్రమేయం లేదు. అంతేగాక ఆయా శాఖల మధ్య సమన్వయం కానరావడంలేదు. మూడేళ్ల నుంచి ప్రకృతి సేద్యం కార్యక్రమాలు కొనసాగు తున్నా క్షేత్ర స్థాయిలో ఆ శాఖల మధ్య సమన్వయం లేదు. అరకొర రైతులు ముందుకు వచ్చి ప్రకృతి సేద్యం చేస్తున్నా వారికి సరైన ప్రోత్సాహం ఉండటంలేదు. ప్రైవేటు కంపెనీలు ఈ రైతుల ఉత్పత్తులను సేకరించుకుని సొమ్ము చేసు కుంటున్నాయే కాని సాగుదారులకు లాభం చేకూరడంలేదు.
(ఆంధ్రజ్యోతి – గుంటూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం (జీరో బడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌-జడ్‌బీఎన్‌ఎఫ్‌)ను ప్రవేశ పెట్టింది. జిల్లాలో దీని కోసం ప్రత్యేక కార్యాల యాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు మం డల కార్యాలయం కృషీ భవన్‌లో వ్యవసాయ శాఖకు చెందిన ఇద్దరు ఏడీలు, ఒక ఏవో ఆధ్వర్యంలో తాత్కాలిక సిబ్బందితో కార్యక్రమా లను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో 3-4 ఏళ్ల నుంచి ఈ పథకం అమలులో ఉంది. గతంలో జిల్లా సమాఖ్యలో డ్వాక్రా సం ఘాల ద్వారా ఎన్‌పీఎం, ఐపీఎం, ప్రాజెక్టుల ను అమలు చేశారు. దశల వారీగా ఆ ప్రాజె క్టుల స్థానంలో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం తెరపైకి వచ్చింది. పాలేకర్‌ ఆధ్వర్యంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పెండేకంటి విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో దీనిని అమలు చేస్తున్నారు.
 
పెదవి విరుస్తున్న విజిలెన్స్‌…
ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి సేద్యంపై ప్రసంగించడానికి అవకాశం కల్పించారు. అయితే ఈ పథకం అమలులో అనేక లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. విజిలెన్స్‌ అధికారులు వారం పాటు జిల్లాలో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నియామకం, వారి పని తీరుపై సమగ్రంగా వివరాలు సేకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు లేకుండానే బినామీ పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు బయో మెట్రిక్‌ లేక పోవడంతో వారిపై ఎటువంటి అజమాయిషీ లేదని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. గుంటూరు మండల కార్యాల యం కృషీ భవన్‌లో జిల్లా స్థాయిలో జడ్బీఎన్‌ఎఫ్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ ఏడీలు రాజకుమారి, వాణిశ్రీలు జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌లు (డీపీఎం)గా కొనసాగుతున్నారు. తెనాలి, గుంటూరు రెవెన్యూ డివిజన్‌లను డీపీఎం-1 రాజకుమారి, గురజాల, నరసరావు పేట రెవెన్యూ డివిజన్‌లను డీపీఎం-2 వాణిశ్రీ పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కార్యాల యంలో శాఖాపరమైన అంశాలను పర్యవేక్షించడానికి ఒక వ్యవసా యశాఖ అధికారిని నియమిం చారు. క్షేత్ర స్థాయిలో సీఏ, రిసోర్స్‌ పర్సన్‌, ఇతర విభాగాల పేరుతో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను నియమించారు.వీరు పని చేస్తున్నారా లేదా అనే అంశాలను పట్టిం చుకున్న వారు లేరు. ప్రధానంగా వ్యవ సా య, ప్రకృతి సేద్యం విభాగాల్లో సమన్వయం లేదు. వ్యవసాయశాఖ ఏవో, ఏడీ, డీడీలు ప్రకృతి సేద్యం కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసలు ప్రకృతి సేద్యం అధికారులు, ఉద్యోగులు వ్యవసాయశాఖ అధికారులను ఎక్కడా ఆహ్వానించడం లేదనే ఆరోపణలు న్నాయి. జిల్లాలో ముఖ్య అధికారులతో ఏర్పాటు చేస్తున్న ప్రకృతిసేద్యం సమావేశా లకు అప్పుడప్పుడు వ్యవసాయశాఖ జేడీని ఆహ్వానిస్తున్నారు.
 

దీర్ఘకాలం సాగు చేయని రైతులు
జిల్లాలో ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయంలో పండిన పంటలకు మార్కెటింగ్‌ వసతులు లేవు. దీనితో ఐటీసీ, రిలయన్స్‌, మోర్‌, విజేత, స్పెన్సర్‌, బెస్ట్‌ ప్రైస్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు రైతుల నుంచి తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆ సరుకును తమ సంచుల్లో నింపి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ప్రకృతి సేద్యం శాఖలో మార్కెటింగ్‌ విభాగం దీనిపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రకృతి సేద్యం వైపు మొగ్గిన రైతులు దీర్ఘకాలం దీనిలో కొనసాగలేక పోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినా రైతులకు మాత్రం అందుబాటులో లేరు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రిటైరైన అధికారులు, ఉద్యోగులకు బెర్త్‌ కల్పించడానికే ఈ శాఖను ఏర్పాటు చేసినట్లుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
 

నేడు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం
జిల్లాలో తొలిసారి వ్యవసాయ, ప్రకృతిసే ద్యం అధికారులు, ఉద్యోగులతో గురువారం జడ్పీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమా వేశానికి వ్యవసాయ, ప్రకృతి సేద్యం అధికా రులు, ఉద్యోగులను ఆహ్వానించారు. ప్రకృతి సేద్యం విభాగంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు పెండేకంటి విజయ్‌కుమార్‌, డాక్టర్‌ రాయుడు, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిష నర్‌ మురళీధరరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ విజయభారతి తదితరులు పాల్గొంటారు.
 
రైతులను ఆకర్షించలేక పోతున్నారు
విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మం దులు ఉపయోగించ డం వల్ల రైతులు నష్ట పోతున్నారు. పంటల్లో నాణ్యత లోపిస్తోంది. వీటిపై అవగాహన కల్పించి ఎక్కువ మంది రైతులను ప్రకృతి సేద్యం పైపు ఆకర్షించలేక పోతున్నారు. ప్రధానంగా ఉద్యాన, వ్యవసా య, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌, సీసీఐ, ఇతర వ్యవసాయ అనుబంధ విభాగా లతో ప్రకృతి సేద్యం అధికారులు, ఉద్యోగులు సమన్వయంగా పనిచేయడం లేదు. పరిశోధ నా రంగాన్ని దీనికి అనుసందానం చేయాలి.
 
– మేకల లక్ష్మీనారాయణ, ఆచార్య ఎన్జీరంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు
 
రైతులకు ఆవులను సబ్సిడీపై ఇవ్వాలి
ప్రకృతి సేద్యంలో ప్రధానమైనది ఆవు. రైతులకు ఆవులను సబ్సిడీపై అందజేయాలి. ప్రతి రైతుకు ఆవును సబ్సిడీపై అందించకుండా మెరుగైన ఫలితాలు రావు. ఆవు మూత్రం, పేడతో ఎరువులను తయారు చేయాలి. జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం వంటి మందులు తయారు చేయకుండా ప్రకృతి స్యేదం చేయలేరు. క్షేత్ర స్థాయిలో జరిగే సమావేశాల్లో ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
 
– పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *