సముద్రంలో రాకాసి తుఫాను


2014 అక్టోబరు 12న హుద్‌హుద్‌ తుఫాను విశాఖ వాసులకు వణుకు పుట్టించింది. ప్రచండ గాలులతో కకావికలం చేసిన రాకాసి తుఫాను అది. అందుకే వాతావరణ శాఖ దాన్ని అసాధారణ తీవ్ర తుఫానుగా పరిగణించింది. అటువంటిదే మరొకటి బంగాళాఖాతంలో ఏర్పడింది. ఫణి కూడా అసాధారణ తీవ్ర తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30నుంచి 31డిగ్రీలు ఉండటం దీనికి అనుకూలంగా మారింది. సముద్రంలో ఏర్పడే తుఫాన్లను పలు కేటగిరీలుగా పరిగణిస్తారు. తుఫాను, తీవ్ర తుఫాను, అతితీవ్ర తుఫాను, అసాధారణ తీవ్ర తుఫాను, సూపర్‌ సైక్లోన్‌గా వీటిని విభజిస్తారు. గంటకు 160నుంచి 170కి.మీ, అప్పుడప్పుడు 185కి.మీ. వేగంతో గాలులు వీస్తే అసాధారణ తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు. హుద్‌హుద్‌ తరువాత ఇప్పుడు ఫణి అసాధారణ తీవ్ర తుఫానుగా బలపడనుందని, ఇది తీరం దాటితే తీవ్ర విధ్వంసం సృష్టిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *