‘సమ్మె నోటిసుపై కంగారుపడాల్సిన అవసరంలేదు’


విజయవాడ: ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటిసు గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని ఏపీయస్ఆర్టీసి ఎండీ సురేంద్రబాబు అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుండి సమ్మెకు వెళ్లడానికి 43 రోజుల సమయం ఉందని, గత డిసెంబర్‌లో కూడా పేస్కేల్‌పై, పెండింగ్ వేతన బకాయిలపై ఇలానే సమ్మె నోటీస్ ఇచ్చారన్నారు. ఫిబ్రవరిలో హామీలపై చర్చలు జరిపామని అనంతరం సమ్మె విరమించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి బడ్జెట్ రాని కారణంగా అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని పేర్కొన్నారు. ఆర్టీసి ఏడాదికి రూ. 5995 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. అయితే బ్యాంక్ లోన్స్ రూపంలో రూ. 3,380 కోట్లు అప్పు ఉందని ఆయన వెల్లడించారు. కొంత వరుకు బకాయిలు ప్రభుత్వం చెల్లించిందని, మరికొంత రావాలని ఆయన చెప్పారు. చార్జీల పెంపుపై నివేదిక తయారు చేస్తున్నామని, త్వరలో ప్రభుత్వంతో చర్చిస్తామని సురేంద్రబాబు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *