సర్వర్ డౌన్ ఎఫెక్ట్.. నేడు కూడా 137 విమానాల రాకపోకల్లో జాప్యం


న్యూఢిల్లీ: ఎయిరిండియా చెక్-ఇన్ సాఫ్ట్‌వేర్ సర్వర్ డౌన్ ప్రభావం నేడు కూడా కనిపించింది. శనివారం తెల్లవారుజామున నుంచి దాదాపు ఐదు గంటలపాటు సర్వర్ డౌన్ కావడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎయిరిండియా విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాదిమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం నాటి సర్వర్ డౌన్ ప్రభావం నేడు కూడా కనిపించింది. ఆదివారం 137 ఎయిరిండియా విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటి సగటు ఆలస్యం 197 నిమిషాలని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 8:45 గంటల వరకు ఎయిరిండియా చెక్-ఇన్, బ్యాగేజ్, రిజర్వేషన్ సాఫ్ట్‌వేర్ డౌన్ అయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *