సాధ్వీపై మాట్లాడేది లేదు: దిగ్విజయ్


భోపాల్: రాజకీయాల్లో ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఈసారి మాత్రం భోపాల్‌లో తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై మాట్లాడేందుకు నిరాకరించారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కకే‌పై సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై మీడియా శుక్రవారంనాడు దిగ్విజయ్‌ను స్పందించాల్సిందింగా కోరినప్పుడు ‘ప్రత్యర్థులను నేను ఎప్పుడూ విమర్శించను. ఆమె గురించి నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు’ అని ఆయన సమాధానమిచ్చారు.
 
ఆర్మీ గురించి, అమరవీరుల గురించి మాట్లాడవద్దని ఎన్నికల కమిషన్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పిందని, హేమంత్ కర్కరే నిజాయితీ కలిగిన అధికారి అని, ఉగ్రదాడిలో ముంబై ప్రజల కోసం ఆయన అమరవీరుడయ్యాడని దిగ్విజయ్ అన్నారు. కాగా, తన శాపం వల్లే ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ప్రాణాలు కోల్పోయాడని 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా గురువారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *