సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద విషాదం


విశాఖపట్నం: జిల్లాలోని గోపాలపట్నం నార్త్ సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద విషాదం నెలకొంది. కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన యువకుడు శంకర్ (21) రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. శంకర్ డీటీడీసీ కొరియర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కాగా..శనివారం ఉదయం భర్త చేతిలో హత్యకు గురైన శారదకు మృతుడు స్నేహితుడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *