సినీనటుడు సుధాకర్‌ కారు ఢీకొని కార్మికురాలి మృతి


  • సుధాకర్‌, డ్రైవర్‌కు గాయాలు
ఆత్మకూరు (మంగళగిరి రూరల్‌), ఏప్రిల్‌ 27: ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం, సినీ నటుడు సుధాకర్‌ ప్రయాణిస్తున్న కారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జె.లక్ష్మి (36) అనే కార్మికురాలు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం… శనివారం విజయవాడ నుంచి గుంటూరు వైపు సినీనటులతో వెళుతున్న కారు ఆత్మకూరు జాతీయ రహదారి వద్దకు రాగానే పూలమొక్కల కోసం నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆపై అదుపుతప్పి డివైడర్‌ మధ్యలో మొక్కల సంరక్షణ పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన లక్ష్మి మృతిచెందగా.. కారులో ఉన్న హీరో సుధాకర్‌, ఆయన డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్‌ఆర్‌ఐకి తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *