సీజే లైంగిక వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్!


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జిల మధ్య విబేధాలు తలెత్తడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తీసుకుంది. ఫిర్యాదుదారును కలుపుకోకుండా సీజే లైంగిక వేధింపుల కేసును విచారించడం సరికాదంటూ.. అంతర్గత విచారణ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్ తేల్చిచెప్పారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన విచారణ కమిటీతో… శుక్రవారం సాయంత్రం జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్‌లు సమావేశమై ఈ మేరకు చర్చించినట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఏకపక్ష విచారణ వల్ల సుప్రీంకోర్టు ప్రతిష్ట దెబ్బతింటుందని న్యాయమూర్తులిద్దరూ స్పష్టం చేశారు.
 
సుప్రీంకోర్టు సీనియారిటీలో ఐదో స్థానంలో ఉన్న జస్టిస్ నారీమన్… ఫిర్యాదుదారుకు లాయర్‌ను పెట్టుకునేందుకు అనుమతించాలనీ లేదా అమికస్ క్యూరీనైనా ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్గత విచారణకు వచ్చేందుకు సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి నిరాకరించినప్పటికీ.. సీజేపై ఆమె చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగించాలని విచారణ కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు జరిగిన విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు మహిళ… తనకు ‘‘న్యాయం జరిగేలా లేదంటూ’’ ఆరోపించింది. ‘‘ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశావంటూ విచారణ కమిటీ నన్ను పదే పదే అడుగుతోంది..’’ అని ఆమె పేర్కింది. విచారణ సందర్భంగా తనకు కనీసం లాయర్‌నుగానీ, న్యాయ సలహాదారును గానీ పెట్టుకునేందుకు ‘‘అనుమతించలేదనీ’’ ఆమె ఆరోపించింది. గతనెల 20 ఓ పత్రిక ప్రచురించిన కథనంతో సుప్రీంకోర్టు సీజేపై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు వెలుగుచూశాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *