సీబీఎస్‌ఈ ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విజయభేరి


గుంటూరు(విద్య), మే 6: సీబీఎస్‌ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో భాష్యం బ్లూమ్స్‌ విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుత ఫలితాలు సాధించారని సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాల విద్యార్థిని మ్రితికసాహా అత్యధికంగా 500 మార్కులకుగాను 485 మార్కులు సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా 482, 477, 475 వంటి మార్కులు సాధించారని వెల్లడించారు. తమ పాఠశాల విద్యార్థులు 37 మంది 90 శాతంపైగా మార్కులు సాధించారని వివరించారు. నూరుశాతం ఉత్తీర్ణతతో అసమాన ప్రతిభ చూపారని వెల్లడించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ, భాష్యం విద్యాసంస్థల సీఈఈ హనుమంతరావు తదితరులు అభినందించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *