‘సుభిక్ష స్టోర్స్‌’ అధినేతపై విచారణకు సుప్రీం కోర్టు ‘స్టే’


చెన్నై: సుభిక్ష స్టోర్స్‌ అధినేత సుబ్రమణియన్‌పై దాఖలైన బ్యాంకు రుణ మోసం సహా అన్ని రకాల కేసుల విచారణను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైకి చెందిన సుబ్రమణియన్‌ 1997లో ‘సుభిక్ష’ పేరిట సూపర్‌ మార్కెట్లను ప్రారంభించి తదనంతరం దేశవ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా దుకాణాలను ఏర్పాటుచేశారు. పెట్టుబడుల కోసం పలు బ్యాంకుల నుంచి రుణం పొందిన ఆయన వాటిని వేరే సంస్థలకు మళ్లించాడని ఆరోపణలు వచ్చారు అలాగే, ఫైనాన్స్‌ సంస్థను కూడా స్థాపించిన ఆయన పలు మోసాలను పాల్పడి నట్లు 2015లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆర్ధికనేర విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుబ్రమణియన్‌ పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.750 కోట్ల రుణాలను పొంది మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. తొలుత సుబ్రమణియన్‌కు చెందిన రూ.50 లక్షల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో, శనివారం సుప్రీంకోర్టు ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు సుబ్రమణియన్‌పై బ్యాంక్‌ మోసం సహా అన్ని రకాల కేసుల విచారణకు తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *