సుమలత విందులో కాంగ్రెస్ నేతలు.. ఆందోళనలో సీఎం


బెంగళూరు: ప్రకృతి చికిత్సా కేంద్రంలో విశ్రాంతికి వెళ్ళిన సీఎం కుమారస్వామి రిసార్టులో విశ్రాంతి కంటే రాజకీయ వ్యూహాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మండ్యలో కాంగ్రెస్‌ రెబల్స్‌ నేతలుగా ముద్రపడిన చలువరాయస్వామి, మాగడి బాలకృష్ణ, నరేంద్రస్వామిలతోపాటు పలువురు మంగళవారం రాత్రి ఓ స్టార్‌ హోటల్‌లో స్వతంత్ర అభ్యర్థి సుమలతతో కలసి విందులో పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాచారం చేరడంతో హుటాహుటిన మంత్రి పుట్టరాజుకు ఉడిపికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఆయన రాత్రికి రాత్రే వెళ్ళారు. బుధవారం ఉదయం వారిరువురు ఏకాంతంగా చర్చలు సాగించినట్లు తెలిసింది. ప్రత్యేకించి చలువరాయస్వామితోపాటు మాజీ ఎమ్మెల్యేలు సుమలతకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే విషయం తెలిసిందే అయినా.. ఏకంగా విందులో పాల్గొనడంపై సీఎంకు మరిన్ని అనుమానాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
 
ఇప్పటికే మండ్యలోని 3 శాసనసభ నియోజకవర్గాలలో నిఖిల్‌కు తగినంత మెజారిటీ సాధ్యం కాలేదని ఇంటెలిజెన్స్‌ నివేదిక తాజాగా సుమలతతో కలసి వారంతా విందులో పాల్గొనడంపై భవిష్యత్తులో ఎలాంటి అడుగులు వేస్తారనే చర్చించుకున్నట్లు తెలిసింది. ఇక ఆపరేషన్‌ కమల పూర్తిగా ముగిసిందని చెప్పలేమని రమేశ్‌ జార్కిహొళి మౌనంగా ఉన్నా మరింతమంది అసంతృప్తులను ఏ విధంగా మచ్చిక చేసుకోవాలనే కోణంలో సీఎం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు మండ్య, హాసన్‌, తుమకూరులపై జరిపించిన సర్వేలను సమీక్షిస్తూనే, మండ్యలో సుమలతకు మద్దతు ఇస్తున్నవారిపైనా దృష్టి సారించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *