సూటి సమాధానాలే లేవు… అన్నీ డొంక తిరుగుడు సమాధానాలే : ప్రియాంకా గాంధీ


న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఏ అంశానికీ ప్రధాని మోదీ సమాధానం ఇవ్వడం లేదని, డొంకతిరుగుడు సమాధానాలిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల మీదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ లేవనెత్తిన ఏ అంశంపైనా మోదీ సమాధానం ఇవ్వలేదని అన్నారు. న్యూఢిల్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లో మోదీపై తీవ్రంగా కోపం, బాధ ఉన్నాయని, ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీపై ప్రజలు తమ కోపాన్ని ఓటింగ్ ద్వారా చూపించారని ప్రియాంక గాంధీ అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *