సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అస్వస్థతకు లోనై ఇద్దరి మృతి


న్యూఢిల్లీ: ఢిల్లీలో రోహిణిలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వెళ్లి అస్వస్థతకు లోనై ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఓ వ్యక్తి తన పాత ఇంటిని బాగుచేయిస్తున్నాడు. ఆ సందర్భంలోనే సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేయించడానికి ఐదుగురు కార్మికులను పిలిచాడు. సెప్టిక్ ట్యాంక్ చాలా రోజుల నుంచి వాడుకలో లేకపోవడంతో విష వాయువు వ్యాపించింది. దాని ప్రభావంతో సెప్టిక్ ట్యాంక్‌లో దిగిన ఐదుగురు కార్మికులు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీపక్(30), గణేష్ సాహా(35) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భద్రతాపరంగా కార్మికులు ఎలాంటి మాస్క్‌లు ధరించకపోవడం, ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని తెలిసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *