సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు


  • ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్‌బోర్డు హెచ్చరిక
అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వేసవి సెలవుల్లో (మార్చి 29 నుంచి జూన్‌ 2 వరకు) తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు, కాంపోజిట్‌ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలను ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. కొన్ని కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గురువారం ఇంటర్‌బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. తాము షెడ్యూల్‌ విడుదల చేసే వరకు ఏ కాలేజీ యాజమాన్యం కూడా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టరాదని ఆమె హెచ్చరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *