సైనిక దుస్తుల్లో వచ్చి కాల్చేశారు!


  • పాక్‌లో అగంతకుల దుశ్చర్య.. 14 మంది మృతి
ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 18: అది పాకిస్థాన్‌లోని కరాచీ-గ్వాదర్‌ రోడ్డు మార్గం. బలూచిస్థాన్‌ రాష్ట్రంలోని ఈ రహదారి గుండా గురువారం వెళ్తున్న 6బస్సులను సైనిక దుస్తుల్లో ఉన్న సుమారు 15-20 మంది తనిఖీలు చేస్తున్నామంటూ ఆపేశారు. 16 మందిని బస్సుల నుంచి దించేసి, ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. దీంతో 14మంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనతో పాకిస్థాన్‌ ఉలిక్కిపడింది. ఈ దుశ్చర్యను పాక్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీ, ప్రధాని ఇమ్రాన్‌ తీవ్రంగా ఖండించారు. కాల్పులకు తెగబడ్డ వారిని గుర్తించాల్సి ఉందని, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని హోంశాఖ ప్రకటించింది. ఈ దాడికి ఇంత వరకూ ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *