సోషల్‌ వార్‌!


  • సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు
  • శత్రువులుగా మారుతున్న స్నేహితులు, బంధుమిత్రులు
  • తమ భావాలను అదుపు చేసుకోలేని విధంగా పోస్టింగ్‌లు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసినా సామా జిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలు, నేతలకు అనుకూల/వ్యతిరేక పోస్టులు పెట్టడాన్ని వాటి వినియోగదారులు ఆపడం లేదు. ఎవరో ఎక్కడో పెట్టిన పోస్టుపై ఇక్కడ ఉన్నవారు కామెంట్‌లు చేస్తూ అప్పటివరకు ఉన్న స్నేహం, బంధు త్వాన్ని కాలదన్నే పరిస్థితికి కూడా వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం సామాజిక మా ధ్యమాల్లో పోస్టులు చూసిన వెంటనే వాటిపై తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక పోతుండటమే. ఆ పోస్టులేవి తమ కడుపు నింపవని తెలిసి కూడా ఆ రొచ్చులోకి ఇట్టే దిగిపోతున్నారు. కొద్దిరోజుల నుంచి జిల్లాలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్న తీరు అభిప్రాయభేదాలను తారా స్థాయికి తీసుకెళుతోంది.
 
నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్యన 20 ఏళ్లుగా స్నేహం ఉన్నది. అయితే వారిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీలను అభిమానిస్తున్నారు. ఇదే వారి మధ్య చిచ్చు రేపింది. జాతీయ పార్టీకి మద్దతుదారుడైన ఒకరు రాష్ట్ర నాయకుడికి వ్యతి రేకంగా పోస్టు పెట్టారు. దానిపై అతని స్నేహితుడు తీవ్రంగా ప్రతిస్పందించాడు. ఇంకేముంది కామెంట్ల యుద్ధం నడిచింది. ఇదేవిధంగా వరసకు అన్నదమ్ము లు అయ్యే బంధువుల మధ్యన కూడా సామాజిక మాధ్యమం వేధి కగా సంవాదం నడిచింది. ఫలాన పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని వస్తా యి, తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం, మీ నాయకుడు జైలుకు వెళ్లే రోజు దగ్గరపడింది, పార్టీ జెండా పీకేశారు, టూలెట్‌ బోర్డులు పెట్టారు వంటి రకరకాల పోస్టులు ఎవరికి తోచిన విధంగా వారు పెడుతున్నారు.
 
సోషల్‌మీడియా పోస్టులపై సరైన కట్టడి లేదు. ఎన్నికల సంఘం కూడా ఈ విషయం లో పెద్దగా చర్యలు చేపట్టలేకపోయింది. జిల్లాలో వీటిని పర్యవేక్షించిన వివిధ కమిటీలు కూడా కంటితుడుపుగా చర్యలతో సరిపెట్టాయి. దీంతో తమకు ఏమి కాదన్న భావన వారిలో బలంగా ఏర్పడింది.
 
ఇలాంటి కామెంట్స్‌తో ఏకీభవించే స్నేహితులు లైక్‌లు, అనుకూల కామెంట్స్‌ చేసి ఊరుకొంటున్నారు. వాటిని వ్యతిరేకించే వాళ్లు పెడుతున్న కామెంట్స్‌తో గొడవలు మొదలవు తున్నాయి. అయితే ఇప్పటివరకు పరిస్థితిని చూస్తే సామాజిక మాధ్యమాల వేదికగా సంవాదాలు, కొన్ని కేసుల్లో ప్రత్యక్షంగా వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. ఇది హద్దు దాటితే మాత్రం భౌతికదాడులు జరిగే అవ కాశం లేకపోలేదు. ఇలాంటి వాటికి విరుగుడల్లా భావోద్వేగాలను అదుపు చేసుకో వడమేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఎక్కువసార్లు సామా జిక మాధ్యమాలు తెరిచి చూడటం వలన ఈ పరిస్థితి తలెత్తుతోందని పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు, నేతలపై అభిమానం ఉంటే అది మనస్సులోనే దాచుకోవాలని సూచిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *