స్మృతి చీరలు, చెప్పులు పంచుతున్నారు: ప్రియాంక


అమేథి: కేంద్ర మంత్రి, అమేథి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ ఈస్ట్ యూపీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అమేథిలో కేంద్ర మంత్రి చీరలు, చెప్పులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ప్రజలకు తప్పుడు హామీలిస్తూ కానుకలు ఎర చూపుతున్నారని ప్రియాంక ఆదివారంనాడు విమర్శించారు.
 
అమేథీ నియోజవర్గంలో స్మృతిఇరానీ చెప్పులు పంచుతున్నారని ప్రియాంక విమర్శలు చేయడం ఇది రెండోసారి. స్మృతి ప్రజలకు చెప్పులు పంచడం ద్వారా వారిని అవమానిస్తున్నారని, వాటిని ఆమెకే తిరిగి ఇచ్చాయాలని ఇటీవల అమేథీ  నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతూ ప్రియాంక సూచించారు. అమేథీ ప్రజలు ఎప్పుడూ ఎవరి ముందూ చేయచాపరని, ఆ అవసరం వారికి లేదని అన్నారు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబ సభ్యుల పట్ల అమేథీ ప్రజలు చెక్కుచెదరని ప్రేమ, ఆప్యాయతలు కనబరుస్తున్నారని కొనియాడారు.
 
కాగా, గాంధీల కుటుంబానికి పెట్టనికోటగా ఉన్న అమేథి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున స్మృతి బరిలో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్‌తో పోటీ పడిన స్మృతి దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, అంతకముందు ఎన్నికల కంటే 2014 ఎన్నికల్లో రాహుల్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని ఆమె తగ్గించగలిగారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *