స్వర్ణ రథంతో దోష పరిహారం.. దశాబ్దన్నర తర్వాత కుక్కే!


  • ఆలయానికి బంగారు రథం
  • రూ.200కోట్లతో నిర్మాణానికి ఆదేశం
  • ప్రజాధనంతో దోష పరిహారం చేసుకోవాలనుకుంటున్న సీఎం
బెంగళూరు: మండ్యలో కుమారుడు నిఖిల్‌ గెలుపుకోసం ముఖ్యమంత్రి కుమారస్వామి కొన్నేళ్ళుగా సాధ్యం కాని మొక్కులను తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. కుక్కేసుబ్రమణ్యస్వామికి బంగారురథం చేయి స్తామనే మొక్కు దశాబ్ధన్నర కాలంగా సాధ్యం కాలేదు. 15ఏళ్ళక్రితం జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ధరంసింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుక్కేకు బంగారు రథం చేయిస్తామని మొక్కుకున్నారు. అప్పటి నుంచి బంగారురథం సమకూర్చే విషయం పెండింగ్‌లో పడుతూనే ఉంది. బీజేపీతో కలసి ఓసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కుక్కేకు బంగారు రథం సమకూర్చడం సాధ్యం కాలేదు.
 
ఈ మేరకు జ్యోతిష్యుడు ద్వారకనాథ్‌ దశాబ్దన్నర కాలంగా పెండింగ్‌లో పడుతున్న మొక్కు తీర్చుకోవాలని లేకుంటే అదే శాపం కానుందని కుమారస్వామికి సూచించినట్లు తెలుస్తోంది. సాధారణంగా దోషనివారణకు కుక్కేకు వెళ్తారని దశాబ్దన్నర కాలంగా మొక్కు తీర్చుకోకపోవడం సరికాదనే ఆలోచనలోపడిన సీఎం అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.200 కోట్లతో బంగారు రథాన్ని తయారు చేయించాలని దేవాదాయశాఖకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ఓవైపు నిఖిల్‌ తన గెలుపుకోసం ఊరూరా ఆలయాలు తిరుగుతుంటే తండ్రి సీఎం కుమారస్వామి ప్రజాధనంతో పాత మొక్కులను నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి బంగారు రథం సమకూర్చడం ద్వారా దోషవిముక్తడవుతారా..? అంటూ చర్చలు ప్రారంభమయ్యాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *