హజ్‌ యాత్రకు టీకాల కొరత!


  •  ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నిలిచిన సరఫరా
  •  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: హజ్‌ తీర్థయాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఈ ప్రపంచ ప్రఖ్యాత యాత్ర కోసం సర్వం సిద్ధమవ్యాల్సిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెనింజైటిస్‌ వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడుతోంది. లక్షలాది మంది తరలి వెళ్లే ఈ యాత్ర సందర్భంగా వ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు ఆరోగ్యశాఖ టీకాలను అందుబాటులో ఉంచుతుంది. అయితే ఆరోగ్య శాఖకు ఔషధాలు సరఫరా చేసే ఘజియాబాద్‌కు చెందిన బయోమ్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫార్మా కంపెనీపై ఆంక్షలు విధించడం వ్యాక్సిన్ల కొరతకు కారణమైంది. గతేడాది ఈ సంస్థ సరఫరా చేసిన టైప్‌-2 పోలియో వ్యాక్సిన్స్‌ కలుషితమైన నేపథ్యంలో ఈ కంపెనీని ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించారు. ప్రతిఏడాదీ భారత్‌ నుంచి 1.27 లక్షల మంది హజ్‌యాత్రకు వెళుతుంటారు. వారి కోసం ఆరోగ్యశాఖ సుమారు 1.47 లక్షల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంచుతుంది. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో ఆరోగ్యశాఖ తమకు వ్యాక్సిన్‌లు సరఫరా చేయాలని ఇప్పటికే రెండు ఫార్మా కంపెనీలతో చర్చించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *