హర్దోయీలో ఎన్నికల బహిష్కరణ… పోలింగ్ కేంద్రం వద్ద కానరాని ఓటర్లు


లక్నో: లోక్‌సభ నాల్గవ దశ ఎన్నికల్లో యూపీలోని 13 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది. కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్, శ్రీప్రకాష్ జైశ్వాల్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు 152 మంది అభ్యర్థులు ఈ దశ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కాగా హర్దోయీ పరిధిలోని సండీలా బ్లాక్ గ్రామ పంచాయతీ ఖుడేహనాలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునివ్వడంతో పోలింగ్ బూత్ దగ్గర ఓటర్లు సందడి కనిపించడంలేదు. ఇప్పటివరకూ ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని సమాచారం.  ఝాన్సీలోని సరస్వతి బాల్ మందిర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. అలాగే అక్బర్‌పూర్‌లోని పుఖరాయా బూత్‌లో మాక్‌పోలింగ్ తరువాత ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *