హిందూ ఉగ్రవాదంపై సినీనటుడు కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు


చెన్నై : రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీధి మయామ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ హిందూ ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే అని కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రంలోని అరవక్కురిచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మోహన్ రాజ్ తో కలిసి కమల్‌హాసన్ ఎన్నికల ప్రచారం చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే…మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది’’ అని కమల్‌హాసన్ విమర్శించారు. అరవక్కురిచి ప్రాంతంలో ముస్లిమ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తాను ఈ మాట చెప్పడం లేదని కమల్‌హాసన్ వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *