హిమాచల్‌లో మంచు తుఫాను ధాటికి ప్రజాజీవనం అస్తవ్యస్తం



షిమ్లా: మంచు తుఫాను దెబ్బకు హిమాచల్‌ప్రదేశ్‌‌లో భారీగా మంచు పేరుకుపోతోంది. ఢాలీ, ఛారబ్రా, మషోబ్రా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జేసీబీ సాయంతో రోడ్డుపై పేరుకు పోయిన మంచును తొలగించారు. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. వాతావరణం ప్రమాదకరంగా మారి విధ్వంసం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే కోస్తా ఆంధ్రా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, పశ్చిమ రాజస్థాన్, బీహార్, చత్తీస్ ఘర్, ఒడిషా, తెలంగాణలలో రానున్న 48 గంటల్లో వేడి గాలులు వీచే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకుంటాయని తెలిపింది. అయితే ఆగ్నేయ, ఈశాన్య భారతల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *