హేమంత్ కర్కరేపై సాధ్వీ ప్రగ్యాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: తీవ్రవాదుల దాడిలో చనిపోయిన మహారాష్ట్ర ఏటీఎఫ్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపై భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఆయన చనిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో తనపై అక్రమ కేసులు పెట్టి, మనోవ్యథకు గురిచేశారని.. ఆయన వంశం మొత్తం నాశనమవుతుందని ఆనాడే హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు. అన్నట్టుగానే 2008లో ముంబైలో జరిగిన  తీవ్రవాదుల దాడిలో ఆయన చనిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. 
 
మాలేగావ్ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లతో సాధ్వీ ప్రగ్యా సింగ్‌కు సంబంధముందని హేమంత్ కర్కరే తన దర్యాప్తులో తేల్చారు. దీంతో ఆమె జైలు పాలయ్యారు. అయితే 2016 మేలో ఆమెకు జాతీయ దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బెయిల్‌ తీసుకున్నారు. భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి సిద్ధమవుతున్న ఆమె.. ఏప్రిల్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *