హౌరామార్గంలో నడిచే రైళ్లపై ఫణి తుపాను ప్రభావం


గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఫణి తుపాను ప్రభావంతో భువనేశ్వర్‌, హౌరా మార్గంలో నడిచే రైళ్లని రద్దు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 2, 3 తేదీల్లో ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల వద్ద ఫణి తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో తీరానికి ఆనుకొనే ఉన్న రైలుమార్గం కూడా ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నది. దీని దృష్ట్యా ఈ నెల 2న హౌరా – సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా, హౌరా – వాస్కోడిగామా అమరావతి, వాస్కోడిగామా – హౌరా అమరావతి, పూణే – భువనేశ్వర్‌ సూపర్‌ఫాస్టు, కేఎస్‌ఆర్‌ బెంగళూరు – భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డి. వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ నెల 3న భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ విశాఖ, హౌరా – సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా, భువనేశ్వర్‌ – కేఎస్‌ఆర్‌ బెంగళూరు ప్రశాంతి, పూరీ – యశ్వంత్‌పూర్‌ గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నామన్నారు. అలానే ఈనెల 2వ తేదీన సికింద్రాబాద్‌ – భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ని విశాఖపట్నం వరకే నడుపుతామన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు రైల్వేకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
 

డెమూ రైళ్లకు 2 శాశ్వత అదనపు బోగీలు
గుంటూరు – రేపల్లె – మార్కాపురం – తెనాలి – మాచర్ల – భీమవరం మధ్యన రాకపోకలు సాగిస్తున్న డెమూ ప్యాసింజర్‌ రైళ్లకు రెండు శాశ్వత అదనపు బోగీలను జోడిస్తున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డి. వాసుదేవరెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయాన్ని తీసుకొన్నామన్నారు. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న ఈ ప్యాసింజర్‌ రైళ్లు ఇకపై 10 బోగీలతో రాకపోకలు సాగిస్తాయన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *