10 నుంచి మిర్చియార్డుకు వేసవి సెలవులు


జూన్‌ 10న లావాదేవీలు పునఃప్రారంభం
 గుంటూరు, (ఆంధ్రజ్యోతి): మిర్చి యార్డుకు వేసవి సెలవులను ప్రకటించారు. ఎండ తీవ్రత దృష్ట్యా యార్డులో వ్యాపా రస్థులు, హమాలీల విజ్ఞప్తి మేరకు నెలపాటు యార్డులో లావాదేవీలు నిర్వహిం చరాదని పాలకవర్గం నిర్ణయం తీసుకొంది. యార్డు చైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి అధ్య క్షతన సమావేశమైన పాలకవర్గ సభ్యులు, అధికారులు, వ్యాపారస్థులు, హమాలీలు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు యార్డులో మిర్చి లావాదేవీలన్నింటిని పూర్తిగా నిలిపేయాలని తీర్మానం చేశారు. తిరిగి జూన్‌ 10వ తేదీన యార్డులో మిర్చి కొనుగోళ్లు, అమ్మకాలను పునరుద్ధరించాలని చైౖర్మన్‌ వెన్నా ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఏటా మే నెల రెండో వారం నుంచి మిర్చి యార్డుకు వేసవి సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి ప్రధాన కారణం రోహిణి, భరణి కార్తెల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఇక్కడ చేరు కొంటుంది. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత మొదలౌతుంది. మధ్యాహ్నం వేళ యార్డు ప్రాంగణమంతా ని ప్పుల కొలిమిలా మారుతుంది. ఆ సమ యంలో కోల్డ్‌స్టోరేజ్‌లలో కూడా మిర్చి అమ్మ కాలు జరపడానికి వీలుండదు. ఈ ఏడాది కూడా దిగుమతి, ఎగుమతి వ్యాపారస్థుల సంఘాలు, హమాలీల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాలకవర్గం సెలవుల నిర్ణయాన్ని తీసుకొన్నది. వేసవి సెలవుల దృష్ట్యా ఈనెల 11వ తేదీనుంచి రైతులు ఎవ్వ రూ మిర్చియార్డుకు సరుకు తీసుకురావొద్దని పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.
 
సరుకు శీతల గిడ్డంగుల్లోకే…
శుక్రవారం వరకు మిర్చియార్డులో ట్రేడింగ్‌ జరగనుంది. శనివారం నుంచి సెలవుల దృష్ట్యా ఇక రైతులు తమ సరుకు పాడైపోకుండా ఉండేందుకు శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకోక తప్పని పరిస్థితి. ఇప్పటికే 40 లక్షల టిక్కీలకు పైగా కోల్డ్‌స్టోరేజ్‌లలో రైతులు నిల్వ చేసినట్లు సమాచారం. సెలవుల దృష్ట్యా మరో 25 లక్షలకు పైగా టిక్కీలు కోల్డ్‌ స్టోరేజ్‌లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *