115 ఏళ్ల బామ్మ మృతి


కొయ్యలగూడెం, మే 3: 115 ఏళ్ళ వృద్ధురాలు మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా కన్నాయగూడెం గ్రామానికి చెందిన గూడపాటి సత్యవతి(115) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. 115 సంవత్సరాలు బతికిన ఆమె పార్థివ దేహాన్ని చూడడానికి గ్రామస్థులు తరలి వచ్చారు. బతికినంతకాలం పూర్తి ఆరోగ్యంతో ఉందని బంధువులు తెలిపారు. మృతిచెందే వరకు జ్ఞాపకశక్తి కూడా భేషుగ్గా ఉందని వారు చెప్పారు. మృతురాలికి ఒక కుమార్తె, మనవళ్ళు, ముని మనవళ్లు ఉన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *