12 బూత్‌లలో మాక్‌పోల్ ఓట్లను డిలీట్ చేయకుండానే…


రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12 పోలింగ్‌బూత్‌లలో మాక్‌పోల్ ఓట్లను అధికారులు డిలీట్ చేయడం మరచిపోయారు. దీంతో ఈ బూత్‌లలోని ఈవీఎంలలో వాస్తవాని‌కన్నా 50 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. ఫైనల్ రిపోర్టింగ్‌లో ఇటువంటి బూత్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే పోలింగ్ జరగడానికి ముందు ఈవీఎం-వీవీప్యాట్ మెషీన్‌లను పరిశీలించేందుకు అధికారులు పోలింగ్ ఏజెంట్ల ముందు మాక్‌పోల్ రూపంతో ఓ‌టువేయడాన్ని చూపిస్తారు. తరువాత వాటిని సీఆర్సీ మాధ్యమంలో తొలగిస్తారు. అయితే వీవీప్యాట్‌లలో మాక్‌పోల్ చీటీలను రికార్డు కోసం భద్రపరచి, ప్రతీ పోలింగ్ ఏజెంట్‌కూ ఇస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 60కి మించిన పోలింగ్‌బూత్‌లలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు మాక్‌పోల్, సీఆర్సీ‌లపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా ఎన్నికల కేంద్రాల వద్ద అతికిస్తున్నారు. అయినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *