13 నుంచి కెనాల్‌ బండ్స్‌ ప్రక్షాళన


విజయవాడ: కెనాల్‌ బండ్స్‌ ప్రక్షాళనకు సిద్దం కావాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మచిలీపట్నం, గుడివాడ మున్సిపల్‌ కమిషనర్లు, రెవెన్యూ, జలవనరుల శాఖ, ముడా అధికారులతో కాలువల ప్రక్షాళనపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం కోనేరు సెంటర్‌ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఎక్స్‌కవేటర్‌లను, ట్రాక్టర్లను ఉదయం 4 గంటలకే సిద్ధం చేయాలన్నారు. అన్ని వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
 
ప్రజల సహకారంతో వ్యర్థాలను తొలగించి మచిలీపట్నం, గుడివాడ పట్టణాలను ఆహ్లాదకరంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. మంగినపూడిబీచ్‌, మచిలీపట్నంలోని ప్రధాన పార్కు లు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెలా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిద్దామని కలెక్టర్‌ అధికారులను కోరారు. జేిసీ- 2 పి.బాబురావు, డీఆర్వో ఏ.ప్రసాద్‌, ముడా పి.విల్సన్‌బాబు, డీపీవో రవీందర్‌, ఆర్డీవో ఉదయ్‌భాస్కర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చక్రపాణి, మచిలీపట్నం, గుడివాడ మున్సిపల్‌ కమీషనర్లు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *