13 నుంచి సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక కోర్సులు


విజయవాడ: వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో నెలకొల్పిన సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో మే 13 నుంచి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఏడు రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ.వి. రత్న ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఈ కోర్సులను మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఇనుస్ర్టుమెంటేషన్‌, ఎలక్టానిక్స్‌ ఇంజ నీరింగ్‌ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన, చదువుతున్న వారు అర్హులన్నారు. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (క్యాడ్‌), కంప్యూటర్‌ ఎయిడెడ్‌ ఇంజనీరింగ్‌ (సిఏఈ), సీఎన్‌సీ ప్రోగ్రామింగ్‌, మిషనింగ్‌, డిజిటల్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఇండస్ర్టియల్‌ రోబోటిక్స్‌, ఇండస్ర్టియల్‌ ఆటోమేషన్‌, ఎలక్ర్టికల్‌, ఎనర్జీ స్టడీస్‌, మెక్‌ట్రానిక్స్‌, ప్రాసెస్‌ ఇన్‌స్ర్టుమెంటేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
 
ఆసక్తిగల విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఈ నెల 13వ తేదీన హాజరుకావాలన్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 8309085598, 9014656286, 9059011336 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *