14న వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమం


ఏలూరు: స్ధానిక మినీబైపాస్‌ రోడ్డులోని క్రాంతి కల్యాణ మండపంలో ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయశాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వ్యవసాయ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ గౌసియా బేగం తెలిపారు. ఎంపీఈవోలు స్థాయి నుంచి సంయుక్త వ్యవసాయ సంచాలకులతో సహా అందరికీ ప్రత్యేక వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయ అధికారుల చేత ఖరీఫ్‌-2019 సంవత్స రంలో నిర్వహించబడుతున్న వివిధ పథకాలపై అధునాతన సాంకేతికకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారన్నారు.
 
కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కార్యదర్శి, స్పెషల్‌ కమిషనర్‌, వ్యవ సాయశాఖ, జిల్లా కలెక్టర్‌, ఎంపీఈవోలు, ఏఈవోలు, వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, ఉపసహాయ సంచాలకులు, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఆత్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవ సాయదారుల ఉత్పత్తి సంఘాలు, ఎరువులు, విత్తనాలకు సంబంధించిన డీలర్లు, వ్యవసాయ యాంత్రీకరణకు సంబం ధించిన డీలర్లు, పీఎం ఫసల్‌ బీమా యోజన ఇన్సూరెన్సు కంపెనీల వారు పాల్గొంటారని గౌసియాబేగం తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *