20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు: యడ్డీ సంచలన వ్యాఖ్యలు


బెంగళూరు: కాంగ్రెస్‌కు చెందిన 20మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. శుక్రవారం హుబ్లీలో మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప ముఖ్యమంత్రి కుమారస్వామి తీరుతో పాటు కాంగ్రె్‌సలో సీనియర్ల విధానాలపై 20మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉ న్నారన్నారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన 104మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఉప ఎన్నికలు జరుగుతున్న చించోళి, కుం దగోళ రెండింటిలోను గెలుపు తమదే అన్నారు.
 
ఇలా ఆరెండింటితో బీజేపీ బలం 106కు పెరగనుందని ఇక స్వతంత్ర్యులు తమతోనే కలిసి వస్తారన్నారు. తద్వారా బీజేపీ బలం పెరుగుతుందని తద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లభిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వ చ్చేందుకు మరో 13 రోజులు మాత్రమే మిగిలి ఉందని తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా సాధ్యమన్నారు. రాష్ట్రంలో సంకీర్ణప్రభుత్వం పూర్తీస్థాయి లో పాలన సాగిస్తామని చెప్పుకోవడం గొప్ప లు పోవడం మినహా మరొకటి లేదని కొట్టిపారేశారు.
 
బ్రెయిన్‌డెడ్‌ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదం లేదా అనారోగ్యం వచ్చినప్పుడు బ్రెయిన్‌డెడ్‌గా వైద్యనిపుణులు పరిగణిస్తారని ప్రస్తుతం అదే దుస్తుతిలో రాష్ట్ర ప్ర భుత్వం చేరిందన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ప్రభావం ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. సామన్య ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, పశుగ్రాసం, ఉపాధిపనులను అమలు చేయడం లేదన్నారు. రా ష్ట్రం లో బీజేపీకి 22 లోక్‌సభ స్థానాలు సాధ్యమవుతాయని మరోసారి ధీమా వ్యక్తం చేశా రు. మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు మరికొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఓటమి చెందనున్నారని జోస్యం చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *