2300 కి.మీ.లు పయనించిన ఫణి


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): తుఫానుకు ‘ఫణి’ పేరును సూచించింది బంగ్లాదేశే. పేరు సూచించిన దేశానికి తుఫాన్లు చేరుకోవడం అరుదు. గత నెల 25న భూమధ్య రేఖకు ఆనుకుని హిందూమహాసముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తరువాత వాయుగుండమై 27న తుఫానుగా మారింది. అప్పుడే ఫణి అని పేరు పెట్టారు. తరువాత అనేక మలుపులు తిరిగి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అనంతరం ఒడిశాలో పూరీ దగ్గర తీరం దాటినా తరువాత 24 గంటలకు పైబడి ఉత్తర ఈశాన్యంగా పయనించి చివరకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడి శనివారం బంగ్లాదేశ్‌లో ప్రవేశించింది. సాయంత్రానికి వాయుగుండంగా మారి రాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. గత నెల 26న వాయుగుండమైనప్పటి నుంచి శనివారం బంగ్లాదేశ్‌లో తిరిగి వాయుగుండంగా మారేంత వరకు పరిశీలిస్తే సుమారు 2300 కి.మీ. దూరం పయనించిందని నిపుణులు విశ్లేషించారు. తొమ్మిదిరోజుల పాటు సుదీర్ఘంగా పయనించిందన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *