26న ‘డెంటల్‌ పీజీ’ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): దంత వైద్యానికి సంబంధించిన పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26న అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టనున్నట్టు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డెంటల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21 నుంచి 23 ఉదయం 11 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. జనరల్‌ క్యాటగిరి అభ్యర్థులకు 172, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 140, ఓసీ దివ్యాంగ అభ్యర్థులకు 156 మార్కులను కటా్‌ఫగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *