370 అధికరణను తొలగిస్తాం: రామ్‌ మాధవ్‌


న్యూఢిల్లీ, మే 5: కశ్మీర్‌ భారత్‌లో కలవకుండా 370వ అధికరణ అడ్డుపడుతోందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కచ్చితంగా తొలగిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్‌ ప్రజలకు, భారతీయులకు మధ్య 370అధికరణ భావోద్వేగపు సరిహద్దును సృష్టించింది. భారత్‌లో కశ్మీర్‌ను పూర్తిగా కలవకుండా అడ్డుపడుతోంది. దాన్ని కచ్చితంగా తొలగిస్తాం. అదే మా వైఖరి అని మొదటినుంచి చెబుతూనే ఉన్నాం. ఢిల్లీలో అయినా, శ్రీనగర్‌లో అయినా మా మాట మారదు. ఇక ఆర్టికల్‌ 35ఏ విషయంలో కూడా సరైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని రామ్‌ మాధవ్‌ వ్యాఖ్యానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *