4న ఏపీ పీసెట్‌


ఏఎన్‌యూ, ఏప్రిల్‌ 25: రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 4 నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరీక్షలు ప్రారంభమవుతాయని కన్వీనర్‌ డాక్టర్‌ పీపీఎస్‌ పాల్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఇప్పటివరకు యూజీడీపీఈడీకి 1,234 మంది, బీపీఈడీకి 1,277 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 నుంచి వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్‌లలోని తేదీ, సమయం ప్రకారం పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. రూ.500 అపరాధ రుసుంతో 26వ తేదీలోపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 28 లోగా తమ దరఖాస్తుల్లోని తప్పులను సరిదిద్దుకోవచ్చని సూచించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *